విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన యువతిపై అమీన్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మాచవరం సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం, జగ్గయ్యపేటకు చెందిన ఓ కుటుంబం వైద్యం కోసం విజయవాడకు వచ్చింది. ఈ సమయంలోనే అమీన్ అనే వ్యక్తి 19 ఏళ్ల యువతిపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు అమీన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.