పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలో నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు షేక్ ఖాసింకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధిత బాలికకు రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. 15 నెలల్లోనే శిక్ష పడేలా వేగవంతమైన దర్యాప్తు చేపట్టినందుకు పోలీసులను సీపీ రాజశేఖర బాబు అభినందించారు.