విజయవాడ: భక్తులు బయటికి వెళ్లే మార్గంలో తోపులాట

7చూసినవారు
ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాల ఆరో రోజున భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లే సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయటకు వెళ్లే మొదటి మార్గాన్ని మూసివేయడంతో, భక్తులు తెచ్చుకున్న వస్తువులు అక్కడే ఉండిపోయినా, వారిని బలవంతంగా బయటకు పంపించివేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.