విజయవాడ: ఇన్స్టా వీడియోలే కొంపముంచాయి.. 12 మంది అరెస్ట్.!

1153చూసినవారు
విజయవాడలోని పోరంకిలో ఇంటర్ చదువుతున్న పవన్ కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక నిర్ధారణకు వచ్చారు. తోటి విద్యార్థులు కొట్టి, వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురై పవన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తనను కొట్టిన విద్యార్థుల పేర్లను చేతిపై రాసుకున్న ఆధారాలను కళాశాల యాజమాన్యం తుడిచివేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్