విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేశ్ అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 13 రోజుల క్రితం కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన గణేశ్ వైద్యం కోసం సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.