పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ యువతితో సహజీవనం చేసి, గర్భం దాల్చిన తర్వాత పరారైన భీమవరానికి చెందిన బాల కేదారేశ్వర స్వామిపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. యనమలకుదురుకు చెందిన 21 ఏళ్ల యువతి పటమటలోని సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా, అదే సమయంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న కేదారేశ్వర స్వామి పరిచయమయ్యాడు. సన్నిహితంగా ఉన్న సమయంలో యువతి గర్భం దాల్చడంతో అతను పరారయ్యాడని మాచవరం సీఐ వెంకట రమణ తెలిపారు.