విజయవాడలోని బుడమేరు కాలువలో గల్లంతైన రాడ్ బెండింగ్ కార్మికుడు పల్లెపోగు రాజేష్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. సోమవారం మధ్యాహ్నం రాజేష్ గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, మంగళవారం ఉదయం నుంచి రెండు బృందాలుగా ఏర్పడి కాలువలో గాలిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.