విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరుతో మహిళను బురిడీ

1142చూసినవారు
విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరుతో మహిళను బురిడీ
నగరానికి చెందిన ఒక మహిళకు ఇంటి వద్ద నుంచే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. ఆన్లైన్లో పని చేసి, ఆకర్షణీయమైన జీతం ఇస్తామని నమ్మించి, ముందుగా లాభాలు చూపించి, పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళ రూ. 6 లక్షలు పలు ఖాతాలకు పంపించగా, మోసపోయినట్లు గుర్తించి మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్