VJA: GGHలో విద్యార్థిని మృతి.. విచారణకు ఆదేశం!

2చూసినవారు
VJA: GGHలో విద్యార్థిని మృతి.. విచారణకు ఆదేశం!
విజయవాడ GGHలో దీపిక అనే విద్యార్థిని గురువారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. విద్యార్థిని అనారోగ్య కారణాలను కూడా విశ్లేషిస్తున్నామని ఆయన తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటరమణ వెల్లడించారు.