
ఉద్యోగాల పేరుతో రూ.16 లక్షల మోసం
విజయవాడలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. భవానీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పద్మజ అనే మహిళ హ్యూమన్ రైట్స్ పేరుతో బాధితులతో పరిచయం ఏర్పరుచుకుని, భాను ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని వారికి పరిచయం చేసింది. వీరిద్దరూ కలిసి APCPDCLలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 16 లక్షల నగదు వసూలు చేసి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



































