సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. హైదరాబాద్-విజయవాడ టికెట్ ధరను ఏకంగా రూ.10 వేలుగా నిర్ణయించి సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా, ధరలపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖాధికారులు మామూళ్ల మత్తులో ఉండి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.