AP: పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి తన సమస్యను వివరించారు. తన తండ్రిపై పెట్టిన తప్పుడు కేసును ప్రశ్నించినందుకు పోలీసులు తనను స్టేషన్‌లో దారుణంగా కొట్టారని ఆమె ఆరోపించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, ఆ పనిని పోలీసులకే అప్పగించారని వాపోయారు. టీడీపీ నేత ఒత్తిడితో తనపైనే తిరిగి కేసు పెట్టారని విద్యార్థిని కన్నీటి పర్యంతమయ్యారు.