భారత్ జీడీపీ 7.6% వృద్ధి: ఓఈసీడీ అంచనా

5047చూసినవారు
భారత్ జీడీపీ 7.6% వృద్ధి: ఓఈసీడీ అంచనా
భారత జీడీపీ వృద్ధిపై ఆశావాహ అంచనాలను ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.6 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.1 శాతం వృద్ధి రేటును భారత్ సాధిస్తుందని తెలిపింది. మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు, హర్మూజ్‌ జలసంధి మూసివేత వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. యూఎస్‌ టారిఫ్‌లు తగ్గడం భారత వృద్ధికి అనుకూలిస్తుందని, గ్యాస్‌ కొరతతో ఉత్పత్తికి కొంత అంతరాయం కలిగినా, ద్రవ్యపరమైన ఉద్దీపనలతో అధిగమించవచ్చని ఓఈసీడీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్