తిరుమల మాదిరిగా భక్తులకు అన్నప్రసాదాలు: తితిదే ఈవో

73చూసినవారు
తిరుమల మాదిరిగా భక్తులకు అన్నప్రసాదాలు: తితిదే ఈవో
తితిదే పరిధిలోని ఆలయాల్లో తిరుమల మాదిరిగా భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని  ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పంపిణీ సవ్యంగా జరిగేలా చూడాలన్నారు. రోజువారీ ప్రసాదాల నివేదిక, ఇతర మత ఉద్యోగుల వివరాలు సేకరించాలని, దేశవ్యాప్తంగా తితిదే పరిధిలోని ఆలయాల్లో అర్చకులు, వేదపారాయణదారుల నియామకంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి ఆలయానికి SOP రూపొందించి సమర్పించాలని అన్నారు.

ట్యాగ్స్ :