విధి నిర్వహణలో అధికారి మృతి

9చూసినవారు
విధి నిర్వహణలో అధికారి మృతి
AP: అనకాపల్లిలోని రాంబల్లి నేవల్ బేస్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌లో భద్రతా సిబ్బంది బీర్ సింగ్ (44) విధి నిర్వహణలో విగతజీవిగా కనిపించారు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్లిన అమిత్ కుమార్ మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతుడికి తుపాకీతో   గాయమైనట్లు సమాచారం. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :