అధికారుల సోదాలు.. చిన్నారిని స్టోరేజి బాక్సులో కుక్కేసిన మహిళ(వీడియో)

6248చూసినవారు
అస్సాంలోని గువాహటిలో ఆరేళ్లుగా ఓ చిన్నారితో వెట్టి చాకిరి చేయిస్తున్న దారుణ ఘటన వెలుగుచూసింది. 13ఏళ్ల బాలికను ఇంటి పనుల నిమిత్తం అమ్రిన్ అక్తర్ అనే మహిళ నిర్బంధించారన్న సమాచారంతో అధికారులు సోదారు చేపట్టారు. అది గమనించిన నిందితురాలు చిన్నారిని మంచం కింద స్టోరేజ్ బాక్సులో కుక్కేసింది. దీంతో దాదాపు అరగంటపాటు ఆ బాలిక ఊపిరాడనిస్థితిలో నరకయాతన అనుభవించింది. అధికారులు సకాలంలో గుర్తించడంతో బాలిక ఊపిరిపీల్చుకుంది. నిందితురాలిపై కఠిన చర్యలకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్