AP: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం అధికారులు తనిఖీలు చేశారు. ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ జి.పణీంద్ర, ఎస్ఐ మల్లికార్జునరావు, పలువురు సిబ్బందితో కలిసి తాళ్లూరు, గంగవరం, బొద్దికూరపాడులోని 8 పెట్రోల్ బంకుల్లో ఆయిల్ నిల్వలను పరిశీలించారు. వాహనదారులకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న తీరును పరిశీలించారు.