యూపీలోని గ్రేటర్ నోయిడాలోని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కారు ప్రమాదానికి గురైంది. అక్కడ తవ్వకాలు జరిపిన సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేయకుండా ఆ గుంతను అలాగే తెరిచి వదిలేశారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, వాహనం మాత్రం దెబ్బతింది. స్థానికులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు.