ప్రముఖ ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం బైక్ రోడ్‌స్టర్ X+ 9.1kWh ధరను భారీగా తగ్గించింది. రూ.1,89,999గా ఉన్న ధరను రూ.1,29,999కు తగ్గిస్తూ ఏకంగా రూ.60 వేల రాయితీ ప్రకటించింది. స్వదేశీ 4680 భారత్ సెల్ వినియోగంతో తయారీ ఖర్చులు తగ్గడంతో ఈ లాభాన్ని వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బైక్‌కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిమీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కొంత టైం మాత్రమే అందుబాటులో ఉండనుంది.