నేటి ఆధునిక కాలంలోనూ Gen Z యువత సైతం కొన్ని పాత ఆలోచనలతోనే ముందుకు సాగుతున్నట్లు ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు 'భార్య ఎప్పుడూ భర్తకు విధేయురాలిగా ఉండాలి' అని నమ్ముతున్నారట. భారత్ తో సహా సుమారు 29 దేశాల్లో జరిగిన ఈ అధ్యయనంలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కింగ్స్ కాలేజ్ లండన్ నిర్వహించిన గ్లోబల్ స్టడీ ప్రకారం ప్రపంచం మొత్తం సమానత్వం దిశగా పరుగులు తీస్తున్న 2026లోనూ లింగ వివక్ష నీడలు ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.