ఆ రోజే.. మెగా డీఎస్సీ నియామక పత్రాలు ప్రదానం

7149చూసినవారు
ఆ రోజే.. మెగా డీఎస్సీ నియామక పత్రాలు ప్రదానం
AP: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తొలుత ఈనెల 19న నియామక ఉత్తర్వుల అందజేతకు నిర్ణయించినా వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా అధికారిక షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్