AP: సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, సీసీ కెమెరాలు పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావని సీఎం స్పష్టం చేశారు.