తెలంగాణలో కోటి మందికి బీపీ, షుగర్.. ప్రతి నలుగురిలో ఒకరు బాధితులే

5945చూసినవారు
తెలంగాణలో కోటి మందికి బీపీ, షుగర్.. ప్రతి నలుగురిలో ఒకరు బాధితులే
తెలంగాణలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరింది. రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగో వంతు మంది ప్రజలు ఈ రెండు జీవనశైలి జబ్బులతో జీవిస్తున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. నేషనల్ హెల్త్ మిషన్ వార్షిక నివేదిక ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.04 కోట్ల మందికి పైగా బీపీ, షుగర్ బారిన పడ్డారు. ఈ ఏడాది కనీసం 25 శాతం మంది రోగులను గుర్తించి, వారి బీపీ, షుగర్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్