ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్లకు మోక్షం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేసిన లక్ష టిడ్కో ఇళ్లను ఉగాది పండుగ సందర్భంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ లక్ష ఇళ్లలో 54,934 ఇళ్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 28,986 ఇళ్లు 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 16,223 ఇళ్లు 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి.