ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో
ఉద్యోగాలు, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపనుంది. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.