AP: ఉల్లిపాయల ధర రోజురోజుకూ ఘాటెక్కుతోంది. గత రెండు నెలల నుంచి ధర పెరుగుతూ వస్తోంది. కిలో రూ.24 నుంచి రూ.54కి చేరింది. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రభుత్వం రైతుబజార్లలో రాయితీ ధరకు కిలో రూ.35 చొప్పున ఉల్లిపాయలు విక్రయించనుంది. రైతుబజార్లలో బుధవారం నుంచి ప్రభుత్వ రాయితీ ఉల్లి పంపిణీ చేయనున్నారు. రేపు విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్‌లో మంత్రి మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.