చైనాకు చెందిన ఒప్పో సంస్థ భారత మార్కెట్లోకి రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో 16, రెనో 16సీ. ఈ నెల 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో
ఇండియా రిటైల్ స్టోర్‌లలో లభించే ఈ ఫోన్లు స్టారీ వైట్, స్టెల్లార్ పర్పుల్, ట్విలైట్ వయొలెట్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. రెనో 16లో 6.32 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 6700mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లుండగా, రెనో 16సీలో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.