AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల కేడర్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 202 ద్వారా ఎంపీపీ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లను జిల్లా కేడర్ ఉద్యోగులుగా నిర్దేశించింది. అలాగే జీవో 201 ద్వారా మొత్తం 27 రకాల టీచర్లను జిల్లా కేడర్‌లో చేర్చింది. ప్రభుత్వ, ఎంపీపీ, జడ్పీ పాఠశాలల్లోని గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను మాత్రం జోనల్ కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది.