గ్రామీణ అంగన్వాడీలకూ 'తల్లికి వందనం'.. ఉత్తర్వులు జారీ

15చూసినవారు
గ్రామీణ అంగన్వాడీలకూ 'తల్లికి వందనం'.. ఉత్తర్వులు జారీ
ఏపీలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని 47,555 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.13,000 జమ చేస్తుంది. సంక్షేమ పథకాల అమలుకు విధించిన ఆదాయ పరిమితి నిబంధనల (గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు) కారణంగా ఇప్పటివరకు వీరికి ఈ పథకం వర్తించలేదు.

సంబంధిత పోస్ట్