అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, 99వ ఆస్కార్ అవార్డుల వేడుకను 2027 మార్చి 14న, 100వ ఆస్కార్ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 2029 నుంచి లాస్ ఏంజిల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో వేడుకలు జరగనున్నాయి. అలాగే దశాబ్దాల టీవీ ప్రసారాలకు స్వస్తి పలికి, 2029 నుండి ఆస్కార్‌లను యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2026-2027 అవార్డుల సీజన్‌కు సంబంధించి, 2027 జనవరి 21న నామినేషన్లు ప్రకటిస్తారు.