మ‌న బ‌డి పిలుస్తోంది.. మంత్రి లోకేష్ ట్విట్

7095చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయులు వినూత్న ప్రచారాలు చేపడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పోస్టర్లు పంచుతున్నారు. పూర్వ విద్యార్థుల విజయగాథలతో కరపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ, పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఈ ప్రయత్నాలను ప్రశంసిస్తూ, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్