మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా, జనవరి 12న విడుదల కానున్న భారీ చిత్రానికి వెసులుబాటు కల్పించింది. జనవరి 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. ఈ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ. 500గా నిర్ణయించారు. సినిమా విడుదలైన మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 (జీఎస్టీతో కలిపి) అదనపు ధరలకు అనుమతినిచ్చారు.