మార్కెట్లో లభించే ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ కొనేటప్పుడు, వాటిపై ఆకట్టుకునే బొమ్మలకే పరిమితం కాకుండా, ప్యాకెట్‌పై ముద్రించిన సూచికలను తప్పక చదవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్
ఇండియా (FSSAI) సూచిస్తోంది. ఆహార పదార్థాలు, పోషకాలు, అలర్జీ కారకాలు, స్టోరేజ్ డేట్, FSSAI లైసెన్స్ నంబర్ వంటి వివరాలను అర్థం చేసుకుని కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఇంగ్రిడియెంట్స్ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో యాడెడ్ షుగర్, మైదా, హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉంటే ఆ ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.