డిప్యూటీ సీఎం పవన్‌పై వైసీపీ మాస్టర్ ప్లాన్..!

2030చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్‌పై వైసీపీ మాస్టర్ ప్లాన్..!
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో ఎదుర్కోవడానికి వైసీపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డిని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్‌గా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్‌ను ఓడిస్తానని శపథం చేసిన ముద్రగడ, ఈసారి ప్రత్యక్షంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో, సీనియర్ నాయకుడిగా ముద్రగడ పార్టీకి సారధ్యం వహిస్తే ప్రభావం ఉంటుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్