ఆసియా కప్ ట్రోఫీపై పాక్ చైర్మన్ పట్టు.. బీసీసీఐ తీవ్ర ఆగ్రహం

9140చూసినవారు
ఆసియా కప్ ట్రోఫీపై పాక్ చైర్మన్ పట్టు.. బీసీసీఐ తీవ్ర ఆగ్రహం
సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి టీమ్ఇండియా ట్రోఫీని గెలుచుకుంది. అయితే ఏసీసీ చైర్మన్, పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహిసిన్ నఖ్వీ ట్రోఫీని భారత్‌కు అప్పగించలేదు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా టీమ్ఇండియా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదని, ట్రోఫీని కూడా నఖ్వీ చేతుల మీదుగా తీసుకోలేదని పేర్కొంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లి ఏసీసీ కార్యాలయంలో ఉంచారు. బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఏసీసీ సమావేశంలో తీవ్రంగా తప్పుబట్టింది. నాలుగు నెలలు గడిచినా, టి20 ప్రపంచ కప్ కూడా వచ్చినా ట్రోఫీ ఇంకా భారత్‌కు రాలేదు. అభిమానులు పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్