పాకిస్థాన్ సూపర్ లీగ్ లో లాహోర్ ఖలందర్, కరాచీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లాహోర్ ఆటగాడు ఫకర్ జమాన్ బంతిని గోళ్లతో గిల్లడం వివాదాస్పదమైంది. కెమెరాల్లో రికార్డయిన ఈ సంఘటనతో అంపైర్ పైజల్ బాల్ టాంపరింగ్ జరిగిందని గుర్తించి, కరాచీ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇచ్చి, బంతిని మార్చారు. దీంతో కరాచీ జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, క్రికెట్ లో క్రీడాస్ఫూర్తిని పాటించాలని, అనైతిక పద్ధతులకు పాల్పడవద్దని అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్ లో సత్తా చూపించి గెలవాలని, ఇలాంటి వ్యవహారాలతో పరువు పోతుందని కామెంట్లు చేస్తున్నారు.