ఇజ్రాయెల్ తరఫున పాలస్తీనాకు వెళ్లి హమాస్‌పై చర్యలు తీసుకోవాలనే ఒత్తిడిని తప్పించుకోవడానికి భారత్‌పై పుల్వామా తరహా దాడికి పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు ప్రధాన లక్ష్యాలుగా ఈ దాడి జరిగే అవకాశం ఉంది. అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, సైనికుల ఆగ్రహాన్ని తగ్గించడానికి పాక్ నాయకత్వం ఈ చర్యకు పాల్పడాలని యోచిస్తోంది.