పాకిస్తాన్‌కు సింధు జలాలు అందవు: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

1662చూసినవారు
పాకిస్తాన్‌కు సింధు జలాలు అందవు: రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్‌డిఎ (NDA) ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి నిరూపించామని, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రక్తం, నీరు కలిసి ప్రవహించవు అన్న హెచ్చరికను పునరుద్ఘాటించారు.  ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కాశ్మీర్, ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో దూసుకుపోతోందన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్