టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్

5735చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో పాక్ మ్యాచ్‌ ఆడదు: షెహబాజ్
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనేదే తమ నిర్ణయమని ఆయన తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది, కానీ ఐసీసీ నిరాకరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15న కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. పాకిస్థాన్ మ్యాచ్‌ను ఆడకపోతే ఐసీసీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్