గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 తర్వాత పాకిస్థాన్ క్రీడా రంగానికి అంతర్జాతీయంగా అవమానం ఎదురైంది. ప్రముఖ బాక్సర్ కుద్రతుల్లా టీమ్ హోటల్ నుంచి రహస్యంగా పరారయ్యాడు. పాస్‌పోర్ట్ ఉన్నా, మేనేజ్‌మెంట్‌ను బురిడీ కొట్టించి కనిపించకుండా పోయాడు. గతంలోనూ బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇద్దరు బాక్సర్లు, ఇటలీలో వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ 2024లో ఒక బాక్సర్ పరారయ్యారు. ఈ గేమ్స్‌లో పాకిస్థాన్ కేవలం ఒక కాంస్య పతకం సాధించి తీవ్ర నిరాశపరిచింది.