పహల్గాం దాడి సూత్రధారి పాక్ అధికారి దయాల్‌ హతం

4705చూసినవారు
పహల్గాం దాడి సూత్రధారి పాక్ అధికారి దయాల్‌ హతం
2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచించి, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్ సైనిక అధికారి లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్‌ను అజ్ఞాత సాయుధులు కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది యాత్రికులు మరణించారు. దాడి తర్వాత భారత సరిహద్దు విధులకు దూరం చేయబడిన దయాల్, ఆపరేషన్ ముగించుకుని వెళ్తుండగా కాల్పుల్లో మృతి చెందారు. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్