AP: ‘పల్లె పండుగ 3.O’ ద్వారా గ్రామాల రూపురేఖలు మారతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ఉదయగిరి నుంచి వలసలు తగ్గాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సభ పెట్టినట్లు వెల్లడించారు. ఈ రెండేళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్ ద్వారా పలు కార్యక్రమాలు జరిగాయన్నారు. గత
వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు కనీస నిధులు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు అండతో పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేశామన్నారు.