
కల్తీ పాల కేసు.. పాలలో 100 లీటర్ల నీరు, 10 కేజీల యూరియా?
AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా.. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా, ఇతర రసాయనాలు కలిపినట్లు తెలుస్తోంది. ఈ కల్తీ పాల దందా రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




