గేదెను ఢీకొట్టిన పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌

3177చూసినవారు
గేదెను ఢీకొట్టిన పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద పల్నాడు-సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఓ గేదెను ఢీకొట్టింది. ఈ ఘటనలో గేదె రైలు చక్రాల కింద ఇరుక్కుపోవడంతో లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఇంజిన్‌లో సమస్యలు తలెత్తడంతో రైలు పట్టాలపైనే ఆగిపోయింది. దీంతో నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్