మంగళవారం అద్దంకిలోని గరటయ్య కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన వీరాంజనేయులు గాయపడగా, ఆయనతో పాటు ప్రయాణిస్తున్న రెబక కుమారి మృతి చెందింది. వెనుక నుంచి క్రేన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.