రూ. 15 లక్షలకు 2లీటర్ల పెట్రోల్? బాపట్ల పంచాయతీ లెక్కలపై కలకలం

3508చూసినవారు
రూ. 15 లక్షలకు 2లీటర్ల పెట్రోల్? బాపట్ల పంచాయతీ లెక్కలపై కలకలం
బాపట్ల మండలం అడవిపల్లిపాలెం గ్రామ పంచాయతీలో కేవలం 2 లీటర్ల పెట్రోల్ కొనుగోలుకు రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అవకతవకలపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌ను ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్