సీఎం ఆదేశం.. మనమిత్ర వాట్సాప్‌లో ఫిర్యాదులు

3706చూసినవారు
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, మనమిత్ర వాట్సాప్ ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరించాలని, వాయిస్ మెసేజ్‌లను కూడా ఫిర్యాదులుగా పరిగణించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడపాలని, సెక్రటరీలు నెలకు 3 రోజులు, కలెక్టర్లు 8 రోజులు పర్యటించేలా సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్