ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలి సిపిఎం

757చూసినవారు
ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలి సిపిఎం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పెదనందిపాడు తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. మండల కార్యదర్శి దోప్పలపూడి రమేష్ బాబు మాట్లాడుతూ, 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2006 నుండి అమలులో ఉన్న ఈ చట్టాన్ని పునరుద్ధరించే వరకు దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్