పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నెహ్రూనగర్‌లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 80 ఏళ్ల అందుగుల ఎల్లమ్మ మృతి చెందారు. ఇంటి నుంచి రోడ్డుపైకి వస్తున్న ఆమెను పిడుగురాళ్ల వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.