మిర్చి యార్డ్ డైరెక్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే బూర్ల

1041చూసినవారు
మిర్చి యార్డ్ డైరెక్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే బూర్ల
గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఇమ్మడి వెంకట మహాలక్ష్మీ, ఇమ్మడి సీతా లీల మల్లేశ్వరరావు గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ను గుంటూరు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే రామాంజనేయులు వారికి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేటర్లు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్